ఐదేళ్లలో జగన్ గనులు, అడవులను అడ్డగోలుగా దోచేశాడు: దేవినేని ఉమా

  • జగన్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన దేవినేని ఉమా
  • అక్రమ మైనింగ్ తో వేల కోట్లను దోచుకున్నాడని విమర్శ
  • స్మగ్లింగ్ లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడని మండిపాటు
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఐదేళ్ల పాలనలో జగన్ గనులు, అడవులను అడ్డగోలుగా దోచేశాడని విమర్శించారు. అడ్డగోలు అక్రమ మైనింగ్ తో వేల కోట్లను దోచుకున్నాడని ఆరోపించారు. రుషికొండపై సైతం విధ్వంసానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. స్మగ్లింగ్ లో ప్రపంచానికే జగన్ ఆదర్శంగా నిలిచాడని చెప్పారు. అవినీతి అనకొండల పనిపట్టి ప్రజాధనాన్ని సీఎం చంద్రబాబు కాపాడతారని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో జరిగిన వనరుల దోపిడీపై చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వీడియోను షేర్ చేశారు.

Devineni Uma
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News